User:TKPS

నిజాలు" (లఘు కవితా ప్రక్రియ) - వికీపీడియా

నిజాలు అనేవి 4 పాదాల నూతన సాహిత్య వచన

లఘుకవితాప్రక్రియ. దీనిని వరంగల్ అర్బన్ జిల్లా భీమారం-రామారం కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయిని

తాడూరి కపిల(కపిల శ్రీనివాస్) రూపొందించారు

తాడూరి కపిల బాల్యం నుండి తన తాతగారు

శ్రీ వెంకట రామయ్య గారు (విశ్రాంత ఉపాధ్యాయుడు) "చల్ చల్ చల్ చల్ మేకల మంద " వంటి ఆసక్తికర అభినయ గేయాలు వేమన పద్యాలు సామెతలు మొదలగు అంశాలలో తర్ఫీదు ఇచ్చారు . తాడూరి కపిల తండ్రి గారు శ్రీ నరసింహ రామయ్య గారు (విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు)తనకు3 సంవత్సరాల వయసులోనే ముప్పై దాకా భగవద్గీత శ్లోకాలు నేర్పించారు. నరసింహ శతకం ,దాశరధి శతకం ,నీతి శాస్త్రం లోని పద్యాలను నేర్పిస్తూ సాహిత్యం పట్ల అభిరుచి కల్పించారు. తాను తెలుగు ఉపాధ్యాయుడు

కానప్పటికీ చక్కని దస్తూరి పట్ల పద్య పఠనం పట్ల

అవగాహన కలిగించడమే కాకుండా చందస్సు అలంకారాలు భాష అంశాలను సులువుగా అవగతమయ్యే విధంగా అభ్యాసం చేయించారు.

తల్లి అనసూయ గారు చిన్నతనంలో "ఇంతింత నారింజపండు" వంటి ఆకట్టుకునే బాల గేయాలను

అభినయంతో నేర్పించి తన వంతు కృషి అందించారు

ఉపాధ్యాయ వృత్తి పట్ల మక్కువతో వృత్తిలో చేరినాక

దాదాపు ఇరవై సంవత్సరాలకు తన సహఉపాధ్యాయుడు శ్రీగోస్కుల రమేష్ గారు ( తెలుగు ఉపాధ్యాయుడు/ కవి) సాహిత్యం పట్ల తనకున్న ఆసక్తిని గ్రహించి

తాను రూపొందించిన "కైతికాలు" అనే నూతన ప్రక్రియలో కవితలు రాయుటకు ప్రోత్సహించారు. అంతకుముందు అడపాదడపా చిన్న కవితలు పేరడీలు పొడుపు కథలు వంటివి రాసిన అనుభవంతోనే పది రోజులలోగా 100 కైతికాలు పూర్తి చేసి కపిల గారు కవి మిత్రబిరుదులు పొందారు అలాగే కైతికాల సంకలనం

తర్వాత కైతిక ప్రక్రియలో ముద్రించబడిన తొలి పుస్తకం

"చైతన్య వీచికలు" తాడూరి కపిల గారిదే అవడం

హర్షణీయం. సాహితి ప్రస్థానంలో అంతకు ముందు ఉన్న ఆసక్తి పుంజుకొని తన భర్త శ్రీ తిరునాహరి శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో రెండు సంవత్సరాలలో 300కు పైగా వచన కవితలు రాసికవి చక్ర బిరుదును కూడా పొందడం జరిగింది .అంతేకాకుండా నానీలు ,రెక్కలు ,హైకూలు ,ఆటవెలది తేటగీతి పద్యాలు, రబాయిలు, గజల్ లు

వంటి అనేక ప్రక్రియలలో రాస్తూ ఉన్న సమయంలో

ఒక రోజు తాను కూడా ఒక మంచి ప్రక్రియను రూపొందిస్తే బాగుంటుందని అనుకుని ,అనుకున్నదే తడవుగా తేదీ19/8/2020 న "నిజాలు" అనే విలక్షణ

నూతన ప్రక్రియను రూపొందించడం జరిగింది.

సామాజిక నైతిక వైజ్ఞానిక మొదలగు అంశాలలో ఈ ప్రక్రియ ద్వారా సామాజిక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆలోచించి రెండు రోజులలో

100 నిజాలు కవితలను రాయడం జరిగింది. వాటిలో కొన్నింటిని అదే రోజు సాహిత్య సమూహంలో పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు శ్రీ బోయ శేఖర్ అనే

కర్నూలుకు చెందిన కవి ఒక గ్రూపు ద్వారా

వీటిని గూర్చి తెలుసుకుని తాను రూపొందిస్తున్న

"నూతన ప్రక్రియల సంకలనం" లో నిజాలు ప్రక్రియకు

సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని సంకలనంలో పొందుపరచడం జరిగింది. దీనికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కూడా దక్కింది. చాలామంది సాహిత్య ప్రియులు నిజాలు ప్రక్రియను ఇష్టపడి

నియమాలను తెలుసుకుంటున్నారు. ప్రశంసిస్తున్నారు.

ఈ ప్రక్రియలోని కవితలు పలుమార్లు ఆన్లైన్ కవితా సమ్మేళనంలో వినిపించడం జరిగింది. పలు సంకలనాలలో ఇవి చోటుచేసుకున్నాయి. పలుమార్లు

వార్తాపత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. కాలంతో పాటు ఎన్నో ప్రక్రియలు వస్తున్నప్పటికీ దీనికంటూ ఒక విశిష్టత ఉంది. ప్రశ్నించడం ఈ కవిత యొక్క ముఖ్య లక్షణం. ప్రశ్న తోపాటు ఆశ్చర్యం నకారాత్మక

అనే అంశాలను కూడా ఈ ప్రక్రియలో ప్రతిబింబించవచ్చు

సరళంగా నాలుగు పాదాలలో వినగానే ఆకట్టుకునే విధంగా ఆలోచింపజేసే విధంగా మాత్రాఛందస్సులో ఇవి రూపొందించబడినాయి.

"నిజాలు"లక్షణాలు(నియమాలు):

1.

ఇది మాత్రాఛందస్సు తో కూడినది.

(లఘువు 1 మాత్ర గురువు 2 మాత్రలు)

ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి

2.

ప్రతి పాదం లో 9 కి తగ్గకుండా 13 కి మించకుండా

మాత్రలు ఉండాలి. (9 -13)

3.

2 ,4 పాదాలు ప్రాస కలిగి ఉండాలి

1 ,3 పాదాలలో ప్రాస ఐచ్చికం ( తప్పనిసరి కాదు)

4.

2 4 పాదాలు ప్రశ్నార్ధక/ ఆశ్చర్యార్థక/ నకారాత్మక

వాక్యాలు ఆయిఉండాలి.

5.

1 ,2 పాదాలు మరియు 3 ,4 నాలుగు పాదాల మధ్య

సమన్వయం కుదిరి చక్కని చురక/చమక్కును ఇవ్వాలి

వివరణ:

ప్రశ్నార్ధక వాక్యం:

వాక్యం చివర ఎందుకని//ఏమిటి/ ఏల/తగునా ఉంటుందా/ ఏమిలాభం/ కలుగునా వంటి పదాలు రావాలి. లేదా మరే విధంగానైనా ప్రశ్న ధ్వనించాలి.

ఆశ్చర్యార్థక వాక్యం:

వాక్యం చివర ఎంత ఘనమొ! కాదా! రాధా!

వంటి పదాలు ఉండాలి. మరి ఏ విధంగా అయినా

ఆశ్చర్యం ధ్వనించవచ్చు

నకారాత్మక వాక్యం:

వాక్యం చివర కాదు లేదు ఉండదు రాదు ఇవ్వకు తగదు వలదు వంటి నకారాత్మక పదాలు రావాలి.

మరే విధంగానైనా నకారాత్మక ధ్వనించవచ్చు

ఉదాహరణలు:

1.

తేనెటీగ మకరందం

గ్రోలకుండ ఉంటుందా ?

భక్తుని మది భగవంతుని

తలవకుండ ఉంటుందా ?

2.

ఆరోగ్యం లేనట్టి

ఐశ్వర్యం ఎందుకని ?

సౌశీల్యం లేనట్టి

విజ్ఞానం ఎందుకని?

3.

తల్లిని గానని తనయుడు

పిల్లులను పెంచటేల?!

జన్మనిచ్చినోళ్లను

ఆశ్రమంల ఉంచుటేల?!

4.

చదువుకునే వయసులో

నిర్లక్ష్యం చేయకు !

బంగారు భవితని

బుగ్గిపాలు చేయకు !!